నెల్లూరు, రవి కిరణాలు:     నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 30వ డివిజన్ నుంచి ఘన విజయం సాధించిన జనసేన పార్టీ అభ్యర్థి నూనె రుషి యాదవ్‌ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా నూనె రుషి యాదవ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు రూరల్‌లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించినందుకు గుర్తుగా ఎమ్మెల్యేకు గదను బహూకరించి ఘనంగా సత్కరించారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.