ఏప్రిల్ 1న నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటన

వింజమూరు మండలంలో ఏప్రిల్ 1వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు వింజమూరు చేరుకోనున్న సీఎం, ముందుగా నార్త్ ఎస్సీ కాలనీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పాతూరు చెరువు బండ వద్ద లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడి, మధ్యాహ్నం ప్రజా వేదిక బహిరంగ సభలో ప్రసంగిస్తారు.