పోర్టు సర్కిల్, ముత్తుకూరు పోలీసు స్టేషన్ లను తనిఖీ చేసిన జిల్లా యస్.పి. శ్రీ CH.విజయ రావు,IPS., గారు.*
*SPS నెల్లూరు జిల్లా*
*KP పోర్టు సర్కిల్, ముత్తుకూరు పోలీసు స్టేషన్ లను తనిఖీ చేసిన జిల్లా యస్.పి. శ్రీ CH.విజయ రావు,IPS., గారు.* 
	సర్కిల్ ఆఫీసు, పోలీస్ స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసులు, క్రైమ్ రికార్డుల పరిశీలన, సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా యస్.పి.గారు.
	సర్కిల్ ఆఫీసు పరిధిలోని గ్రేవ్, NDPS తదితర కేసుల పురోగతిపై ఆరా....
	పోలీసు స్టేషన్ మ్యాప్ ను పరిశీలిస్తూ, స్టేషన్ పరిధిలో ఉన్న పరిస్థితులు, నేర ప్రాంతాలపై ఆరా.. 
	వరదలు వచ్చిన సమయంలో ముత్తుకూరు పోలీసు అధికారుల సేవలు అభినందనీయం. రేయింబవళ్ళు తక్షణమే స్పందించారు.  
	కోల్పోయిన ప్రాపర్టీ రికవరీపై దృష్టి సారించాలి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి.
	రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశాలు..
	నేరనిరోధానికి విజబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ వ్యవస్థను ముమ్మరం చేయాలి... 
	నమోదుకాబడిన కేసులలో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి, చార్జ్ షీట్ ఫైల్ చేయాలి. నిందితులకు కోర్టులో కఠిన శిక్షలు పడాలి.
	ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోండి .. కనీస సౌకర్యాలు అందించి, ధైర్యం కల్పించి, సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ఉండాలి.. 
	స్పందన ఫిర్యాదులను ఎటువంటి ఆలస్యం లేకుండా పరిష్కరించండి.. 
	*ప్రతి గ్రామంలో CC కెమెరాలను తప్పక ఏర్పాటు చేసుకోవాలని సూచన.*
	గ్రామాలు, స్కూల్స్, కళాశాలలో లోన్ యాప్ లపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మహిళా పోలీసులకు సూచన.... 
	పోలీసు సిబ్బంది సంక్షేమమే ప్రధమ కర్తవ్యం.... పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క యోగ క్షేమాలు అడిగి, ఏమైనా సమస్యలు ఉన్నాయా? వారి యొక్క గ్రీవెన్స్ ను అడిగి, వెంటనే పరిష్కరించేలా ఆదేశాలు..
  
  