భాజపా కార్యకర్తలపై వైకాపా దాడి..*
♦️ *భాజపా కార్యకర్తలపై వైకాపా దాడి..*
 ♦️ *భాజాపాపై కర్రలు,రాళ్ళు రువ్విన వైకాపా ..*
♦️ *దాడిలో గాయపడ్డ భాజపా కార్యకర్తల కుటుంబాలు..*
♦️ *గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు* 
♦️ *పోలీసులు రంగ ప్రవేశం* 
 *♦️ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు* 
 భూస్వాముల చేతుల్లో నలుగుతున్న ప్రభుత్వ భూములను విడిపించాలని  కోరుతూ వా కాడు మండల తహసీల్దారుకు పిర్యాదు చేసిన  పాపానికి భారతీయ జనతాపార్టీ కార్యకర్తల కుటుంబాలపై వైకాపా నేతలు విషం కక్కారు..  కర్రలతో, రాళ్ళతో ఒక్కసారిగా విరుచుకుపడి భాజపా కార్యకర్తలను దాడి చేసిన సంఘటన వాకాడు మండలం, జమీన్ కొత్తపాలెం గ్రామంలో చోటు చేసుకుంది..* 
 *వాకాడుమండలం ,జమీన్ కొత్తపాలెం గ్రామంలోని ప్రభుత్వ భూములతో పాటు, చెరువులను సైతం కొందరు భూ స్వాములు ఆక్రమించుకుని పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు బాదితులు గత రెండురోజుల క్రితం వాకాడు తహసీల్దారుకు పిర్యాదు.. చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఇరువర్గాల వివాదం తారాస్థాయికి చేరుకుంది.. భాజపా పిర్యాదును సహించలేని వైకాపా నేతలు వారిపై దాడికి దిగారు. దొరికివాళ్ళను కర్రలతో కొట్టారు.. దొరకని వాళ్ళను రాళ్ళతో రువ్వారు..ఈదాడిలో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు,గాయపడిన వారిని ఆసుప్రతిలో చేర్పించడం తో వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.* 
 *గ్రామంలో వివాదం వివాదాలు తారాస్థాయికి చేరుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు, గ్రామంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా పోలీసులు పహారా కాస్తున్నారు, గాయపడ్డ వారిని నుండి పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.*
  
  
  






