కో ఆప్షన్ సభ్యుడిపై బూతు పురాణాలు, చేయి చేసుకున్న ఎస్సై పోపూరి రవిబాబు.

 పోలిసుల అదుపులో కో అప్షన్ సభ్యుడు.

పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్సిపి నాయకులు ఉద్రిక్తత.

ఆందోళనకు దిగిన మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి.

కో అప్షన్ సభ్యుడు సునీల్ రెడ్డి ని విడిచి 

పెట్టడం తో సర్దుమణిగిన వివాదం.

 రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-

సూళ్లూరుపేట లో అధికార వైసీపీ కి చెందిన మునిసిపల్ కో అప్షన్ సభ్యుడు కళత్తూరు సునీల్ రెడ్డిని స్థానిక పోలీసులు ఆదివారం రౌడీ షీట్ కౌన్సిలింగ్ కోసం పోలీస్ స్టేషన్  కు పిలిపించి అదుపులోకి తీసుకోవడం పై వివాదం చెలరేగింది, సునీల్ రెడ్డి ని విడిచి పెట్టాలంటూ ఒక వర్గానికి చెందిన వైసీపీ నేతలు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట  ఆందోళనకు దిగడం తో పరిస్థితి ఉదృక్తముగా మారింది , దాంతో పాటు పట్టణ వైసీపీ  అధ్యక్షుడు కళత్తూరు శేఖర్ రెడ్డి,మునిసిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి  పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని లోపలకు వెళ్లి సునీల్ రెడ్డిని చుపించాలంటూ,వెంటనే పంపించాలంటూ  శ్రీమంత్ రెడ్డి ,శేఖర్ రెడ్డి అక్కడే బైఠాయించడం తో పరిస్థితి మరింత జటిలంగా  మారింది దీంతో ఇంచార్జి సిఐ నరసింహా రావు సర్ది చెప్పి కళత్తూరు సునీల్ రెడ్డిని పది నిమిషాలలో వదిలిపెట్టడం జరుగుతుందని చెప్పి ఒప్పించి వదిలిపెట్టడం తో  గొడవ సర్దుమణిగింది, బయటకు వచ్చిన కో అప్షన్ సభ్యుడు కళత్తూరు సునీల్ రెడ్డి  మాట్లాడుతూ తనను ఎస్సై రవిబాబు ఉద్దేశపూర్వకంగా అదుపులోకి తీసుకొని కొట్టాడని  తన ఒళ్ళంతా గాయాలు ఉన్నాయని ఆరోపించారు, తన వద్ద నుండి సెల్ ఫోన్,

రెండులక్షల ఎనభై మూడు వేల రూపాయిల నగదును లాకున్నట్లు తెలిపారు.ఇటీవల 

తాను ప్రెస్ మీట్ పెట్టి   ఎస్సై  పై ఆరోపణలు చేసానని అందుకే  ఈ విదంగా కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నించారని విమర్శించాడు, శ్రీమంత్ రెడ్డి అద్వర్యం లో కళత్తూరు సునీల్ రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కొట్టిన గాయాలకు చికిర్చ చేయించారు.ఈ సందర్భముగా మునిసిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి ప్రెస్ తో మాట్లాడుతూ అధికార  పార్టీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని ,తరచూ పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని ఆయన ఖండించారు, ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు.