కలువాయి మండలం వెరుబోట్లపల్లిలో అస్వస్థతకు గురై నెల్లూరులోని జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న పశ్చిమ బెంగాల్ వలస కూలీలను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, సిటీ నియోజకవర్గ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, సీనియర్ నాయకులు డాక్టర్ జెడ్ శివప్రసాద్ తదితరులు..





కూలీల ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారులతో చర్చించి మెరుగైన వైద్యం అందించాలని సూచించిన సోమిరెడ్డి, పత్తిపాటి


సోమిరెడ్డి కామెంట్స్


పొట్టకూటి కోసం నెల్లూరుకు వచ్చిన బెంగాల్ వలస కూలీలు ఊహించనిరీతిలో అస్వస్థతకు గురికావడం బాధాకరమైన ఘటన..


ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ స్పష్టమైన కారణాన్ని గుర్తించలేకపోవడం దురదృష్టకరం..


నీటి కాలుష్యంతోనే కూలీలు అస్వస్థతకు గురయ్యారని భావిస్తున్న తరుణంలో వాళ్లు నీళ్లు తాగిన బోరును మూడు రోజుల తర్వాత లాక్ చేస్తారా...అంత నిర్లక్ష్యమా..


ఇంకా పలువురు ఐసీయూలో ఉన్నారు...వారికి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదులోని ఆస్పత్రులకు తరలించండి..


బెంగాల్ వాసులైనప్పటికీ ఆంధ్రా వాళ్ల ప్రాణాలతో సమానంగా చూడండి...


చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా, చికిత్స పొందుతున్న కూలీలకు రూ.50 వేలు వంతున ప్రభుత్వం సాయం అందించాలి...


పశ్చిమబెంగాల్ లోనూ మీ ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా ఉదారంగా సాయం చేయాలని జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నా..


నెల్లూరు జీజీహెచ్ లో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్న వైద్యాధికారులకు నా అభినందనలు..


ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఈ ఆస్పత్రిలో సెల్లార్ లో నీళ్లు రావడం, కరెంట్ లేక వాటిని తోడలేకపోవడం, చివరకు వెంటిలేటర్లపై ఉన్న వారు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం బాధాకరం..


మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉండటంతో పాటు కోవిడ్ ఆస్పత్రిగా ఉన్న జీజీహెచ్ నిర్వహణ విషయంలో ఇంత నిర్లక్ష్యమెందుకు...


మరోమారు ఇలాంటి పరిస్థితులు పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలి..


ఏలూరులో ప్రజలు అస్వస్థతకు కారణమవడానికి కూడా ఇప్పటివరకు కారణం చెప్పలేకపోతున్నారు..ఇంకా ఎన్ని రోజులు కావాలి..


ప్రజల ప్రాణాల విషయంలో మేం రాజకీయాలు చేయబోం..కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి..


పత్తిపాటి పుల్లారావు కామెంట్స్


నారేతల కోసం నెల్లూరుకు వచ్చిన బెంగాల్ వలస కూలీలకు మెరుగైన వైద్యం అందించాలి..


మొన్న ఏలూరు, నిన్న నెల్లూరు...ఈ ఘటనల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది..


రోజులు గడుస్తున్నా ప్రజలు అస్వస్థతకు గురవడానికి కారణాలు వెల్లడించలేకపోతున్నారు..


ఎవరి పాపాన వారు పోతారు..అనే ధోరణిలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది..


కట్టుబట్టలతో ఉన్న బెంగాల్ కూలీలకు మానవతా దృక్ఫథంతో సాయం చేసి వారిని సొంత రాష్ట్రానికి గౌరవంగా పంపాలి...


విధ్వంసం, వినాశకాలు, ధనార్జనే ధ్యేయంగా పెట్టుకోకుండా ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు స్పందించడం కూడా అలవరుచుకోవాలి...