తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బిజెపి రాష్ట్ర వ్యవహారాల కో ఇన్చార్జి సునీల్ దేవధర్, బిజెపి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మధుకర్ పాల్గొన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు.