శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం
శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం
తిరుమల శ్రీవారిమెట్టు మార్గంలో చిరుతపులి సంచారం భక్తుల్లో కలకలం రేపింది. గురువారం సాయంత్రం 400వ మెట్టు వద్ద చిరుతను గుర్తించిన భక్తులు టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు, భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, శుక్రవారం ఉదయం నుంచి నడకమార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు. ఈ సంఘటనతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.