మంత్రి ఆనం ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం శ్రీ నాగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం పరిశీలన ప్రారంభం
మంత్రి ఆనం ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం శ్రీ నాగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం పరిశీలన ప్రారంభం
నెల్లూరు [చేజర్ల], రవికిరణాలు జూలై 31 :
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్ళపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానము అభివృద్ధికి సంబంధించి అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. కొన్ని రోజుల క్రితం ఆలయాన్ని స్వయంగా సందర్శించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ,ఆలయ చరిత్రకు తగిన అభివృద్ధి చేపడతామని భరోసా ఇచ్చారు.
ఈ క్రమంలో ఆలయ పునఃనిర్మాణానికి అవసరమైన నిధులు,అభివృద్ధి ప్రణాళికలు వంటి అంశాలపై నివేదిక సమర్పించాల్సిందిగా దేవాదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ నేపథ్యంలో గురువారం దేవాదాయ శాఖ అధికారులు ఆలయాన్ని సందర్శించి స్థల పరిస్థితులు, నిర్మాణ అవసరాలు, పురాతన శిల్పకళా ప్రాముఖ్యత తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పరిశీలనకు వచ్చిన వారిలో
పి. పరమేశ్వరప్ప, రాష్ట్ర దేవాదాయ శాఖ స్థపతి,చి. శ్రీనివాసులు, గుంటూరు డీఈఈ, ఏ. మురళీమోహన్, నెల్లూరు జిల్లా ఏఈఈ, పి. సురేంద్ర, సహాయక స్థపతి ఇతర సాంకేతిక సిబ్బంది పరిశీలించారు.
ప్రతినిధి బృందం ఆలయ నిర్మాణానికి సంబంధించిన వివిధ కోణాలను అధ్యయనం చేసి, తగిన ప్రతిపాదనలతో నివేదికను సిద్ధం చేయనున్నారు. భవిష్యత్తులో ఈ దేవస్థానాన్ని ప్రసిద్ధ పవిత్ర క్షేత్రంగా అభివృద్ధి చేయాలనే దిశగా ప్రభుత్వ యత్నాలు కొనసాగుతున్నాయి.