మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వెంకటాచలం పీఎస్ లో నమోదైన క్రిమినల్ హైకోర్టు కేసును క్వాష్ చేసింది. ఎన్నికల అనంతరం వైకాపా నేతల ప్రోద్బలంతో ఇడిమేపల్లి భూముల విషయంలో సోమిరెడ్డిపై ఫోర్జరీ, ట్రెస్పాస్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. సోమిరెడ్డి అలాంటి పనులు చేయరని తెలిసినా రాజకీయ ఒత్తిళ్లతో వెంకటాచలం పీఎస్ లో నాలుగున్నర గంటల పాటు విచారణ పేరుతో పోలీసులు వేధించారు..సోమిరెడ్డి తన భూములకు సంబంధించి 1933 నుంచి ఉన్న డాక్యుమెంట్లను పోలీసులకు చూపడంతో పాటు మీడియా ముందు పెట్టారు..సోమిరెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిపి కేసును క్వాష్ చేసిన హైకోర్టు..తమ నాయకుడిపై రాజకీయ కక్షతో నమోదు చేయించిన కేసు క్వాష్ కావడంతో ఆనందంలో కార్యకర్తలు, అభిమానులు..