146కి చేరిన హాంకాంగ్ మృతుల సంఖ్య
146కి చేరిన హాంకాంగ్ మృతుల సంఖ్య
హాంకాంగ్ అగ్ని ప్రమాదం<<>>లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 18 మృతదేహాలను వెలికితీయడంతో మొత్తం మృతుల సంఖ్య 146కి చేరింది. 100 మంది ఆచూకీ తెలియరాలేదని, 79 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. భారీ మంటల వల్ల శరీరాలు కాలిపోయి మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితికి చేరాయి. ప్రమాదం జరిగిన అన్ని బిల్డింగ్‌లలో సహాయక చర్యలు పూర్తయ్యే సరికి మూడు నుంచి నాలుగు వారాలు పట్టొచ్చని పోలీసులు తెలిపారు.