సచివాలయం సిబ్బందికి ఘన సన్మానం.
సచివాలయం సిబ్బందికి ఘన సన్మానం.
నెల్లూరు [బోగోలు], రవికిరణాలు జూలై 22 :
బోగోలు మండలం కోవూరుపల్లి సచివాలయ సిబ్బంది మహిళా పోలీస్ కె.మౌనిక , అగ్రికల్చర్ అసిస్టెంట్ పి.సుధీర్ , ఏఎన్ఎం డి.అనిత,సర్వేయర్ అసిస్టెంట్ కె సురేష్ , కార్యాలయంలో ఐదు సంవత్సరాలుగా విధులు నిర్వహించి సాధారణ బదిలీలలో భాగంగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం బదిలీపై వెళ్తున్న సిబ్బందికి గ్రామ పెద్ద ఇందుపూరి రామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి ఎస్.రాజగోపాల్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిజిటల్ అసిస్టెంట్ యం శ్యాం సుధాకర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ టి భారతి, పంచాయతీ సెక్రెటరీ బి కృపమై, ఏఎన్ఎం అమల పాల్గొన్నారు.