అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం, అడుగడుగునా మంగళ హారతులతో మహిళల అపూర్వ స్వాగతం.

సూపర్ సిక్స్ లో 80 శాతం హామీలు అమలు చేసాం

ఉత్సాహంగా పాల్గొంటున్న నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందించేందుకు కార్యకర్తలు కృషి చేయాలి

మంత్రి లోకేష్ ప్రవేశపెట్టిన ఒన్ క్లాస్ ఒన్ టీచర్ విధానంతో ప్రభుత్వ విద్యారంగం బలోపేతం అయింది

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి





నెల్లూరు [ఇందుకూరుపేట], రవికిరణాలు జూలై 23 : 

ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు చేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంపని చేస్తుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు.సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మైపాడు (కృష్ణాపురం)  కొరుటూరు (కొలిమిట్ల పాళెం) సోమరాజుపల్లి, మొత్తలు గ్రామాలలో పర్యటించారు. స్థానిక టిడిపి మరియు కార్యకర్తలతో కలిసి ఇల్లిల్లూ తిరిగి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. స్థానిక సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం సందర్భంగా పేదలకు ఇళ్ళు, ఇళ్ల స్ధలాలు లేని పరిస్థితిని చూశానని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పేదల సొంతింటి కల సాకారం చేస్తానన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాగానే రైతులకు ప్రయోజనం చేకూర్చే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన విషయాన్నిఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అమలు చేసిన పెన్షన్ పెంపు, దీపం 2,మత్స్యకార సేవలో,తల్లికి వందనం తదితర సంక్షేమ పధకాల గురించి ఆమె ప్రజలకు వివరించారు.ప్రభుత్వ సంక్షేమ పధకాల అమలు తీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. 

చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయన్నారు.ఎన్నికల సందర్భంగా చేసిన సూపర్ సిక్స్ హామీలలో 80 శాతం అమలు చేసామన్నారు.గంగపుత్రులు గతంలో 10 వేలు వున్న వేట నిషేధ భృతిని కూటమి ప్రభుత్వం 20 వేలకు పెంచి వేట నిషేధ కాలంలో అందచేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఫిషరీస్ అధికారుతో మాట్లాడి అర్హులైవుండి మత్స్యకార సేవలో రాని వారిని గుర్తించి వారికి ప్రభుత్వ పరిహారం ఇప్పించేందుకు కృషి చేయాలని నాయకులను ఆదేశించారు. వారిని సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్న నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.ఎన్నికల సందర్భంగా తనను అమ్మలా, అక్కలా, ఆదరించి తన విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ యిచ్చారు.ఈ నెలలో అన్నదాత సుఖీభవ పధకం ద్వారా రైతులకు 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందిచడంతో పాటు ఆగస్ట్‌ 15 వ తేదీ నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీి బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతున్నట్టు ఆమె వెల్లడించారు.కోవూరు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎన్నికల సందర్భంగా చేసిన ప్రతి వాగ్ధానం అమలు చేస్తానని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  ప్రజలకు హామీ యిచ్చారు. భావితరాల బంగారు భవిషత్తు కోసం విద్యాశాఖ మంత్రి లోకేష్  ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డొక్కా సీతమ్మ మధ్యాన భోజన పధకం ద్వారా నాణ్యమైన భోజనంతో పాటు సర్వేపల్లి రాధాకృష్ణన్  పేరిట స్టడీ కిట్స్ అందిస్తున్నా రన్నారు.ఒన్ క్లాస్ ఒన్ విధానం ద్వారా ప్రభుత్వ విద్యారంగం బలోపేతం అయిందన్నారు.15 ఆర్ధిక సంఘ నిధుల ద్వారా స్థానిక సంస్థలు బలోపేతమై గ్రామీణ ప్రాంతాలలో జరుతున్న అభివృద్ధిని వివరించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు,ఉచిత ఇసుక ద్వారా భవన నిర్మాణ కార్మికులకు జరుగుతున్న ప్రయోజనాలను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రస్తావించారు. రానున్న నాలుగేళ్లలో కోవూరు నియోజకవర్గంలో రోడ్లు,డ్రైన్లు, తాగునీరు, లాంటి మౌలిక సదుపాయాలతో పాటు పేదల సొంతింటి కల సాకారం చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో ఇందుకూరు పేట మండల టిడిపి అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి,టిడిపి నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి,రావెళ్ల వీరేంద్ర నాయుడు,చెంచు కిషోర్ యాదవ్, పి ఎల్ రావు, చెన్నయ్య, చంద్రమోహన్ రెడ్డి,ఈదూరు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.