మైనర్ బాలికపై అత్యాచారం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బసవరాజు పాలెం లో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలిక (11) మేకలు కాస్తుండగా బూతు వీడియోలు చూపించి  అదే గ్రామానికి  చెందిన వరుసకు తండ్రి అయిన ఓ కామాంధుడు  మైనర్ బాలికపై  అత్యాచారానికి పాల్పడ్డాడు. దింతో బాలిక తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఆ మానవ మృగాన్ని  అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై
నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.