జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆదూరు సుష్మా
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆదూరు సుష్మా
నెల్లూరు, రవికిరణాలు జూలై 23 :
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆదూరు సుష్మా ను నియమించినట్లు ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ పద్మజా యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని బీవీనగర్ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో బిసి మహిళ విభాగాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పూర్తిస్థాయిలో కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళలను చైతన్యవంతం చేసి వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. చట్టసభల్లో బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించేందుకు పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. నూతనంగా ఎంపికైన ఆదూరి సుష్మా మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా తనను నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బిసి మహిళా విభాగాన్ని జిల్లాలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు వల్లెపు రజిని, ఊడతా శైలజ, జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి, మౌనిక, బుజ్జమ్మ, సుజాత, బండి ప్రసాదు, మల్లెపు వెంకటేశ్వర్లు ఆదూరు శ్రీధర్, సుధాకర్, గోపి తదితరులు పాల్గొన్నారు