కె ఎం ఆర్ గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎన్ డి సి సి బి  డైరెక్టర్ కలికి మాధవ రెడ్డి (కె ఎం ఆర్ ) నెల్లూరు అన్నమయ్య సర్కిల్ గోమతి సెంటర్లో నూతనంగా నిర్మించి, సోమవారం జరిగిన గృహప్రవేశ కార్యక్రమంలో సూళ్లురుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కలికి మాధవ రెడ్డి,కలికి సుధీప్ రెడ్డి దంపతులకు అభినందనలు తెలియజేశారు.ఎమ్మెల్యే కిలివేటి వెంట ఎన్ డి సి సి బి చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఒట్టూరు కిషోర్ యాదవ్,నాయుడుపేట ఎంపిపి కురుగొండ ధనలక్ష్మి, సూళ్లూరుపేట ఎంపిపి అనిల్ రెడ్డి, వైసిపి సీనియర్ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి, ఎమ్మెల్యే సంజీవయ్య యువసేన అధ్యక్షులు పోట్లపూడి రాజేష్,మాజీ ఏ ఎం సి డైరెక్టర్ నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బైనా మల్లికార్జున్ రెడ్డి, పాదర్తి హరినాధ్ రెడ్డి,వి మునస్వామి నాయుడు, ముత్యాల రెడ్డి,భావన్, గోనుపల్లి గురుమూర్తి, బల్లి కుమార్,వైసిపి కార్యకర్తలు,అభిమానులు ఉన్నారు.