స్వచ్ఛ ర్యాంకు సాధనలో ఇంజనీరింగ్ విభాగం పాత్ర అభినందనీయం
స్వచ్ఛ ర్యాంకు సాధనలో ఇంజనీరింగ్ విభాగం పాత్ర అభినందనీయం
కమిషనర్ వై.ఓ నందన్
నెల్లూరు, [కార్పోరేషన్], రవికిరణాలు జూలై 18 :
స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో భాగంగా 2024 - 25 వార్షిక సంవత్సరానికి గాను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 37వ ర్యాంకు సాధించడంలో కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాత్ర అత్యంత అభినందనీయమని కమిషనర్ వై.ఓ నందన్ ప్రశంసించారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు కమిషనర్ ను శుక్రవారం కలుసుకుని పూల మొక్కల కుండీలను అందజేసి శుభాకాంక్షలను తెలియజేసారు.
ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు సాధనకు కృషి చేసిన ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్ మోహన్ రావు, ఈ.ఈ రహంతు జానీ, అనిల్ కుమార్, డి.ఈలు ముజాహిదీన్, రఘురామ్, సుధేష్ణ, ప్రసాద్, ఎ.ఈ అర్చిత తదితరులను కమిషనర్ శాలువాలతో సన్మానించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ డైరెక్టర్ మాధురి, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహారావు, పి ఎం యు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.