నెల్లూరు, జనవరి 8, (రవికిరణాలు) : ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2020 సంక్రాంతి సంబరాలు టౌన్‌హాల్‌లో మిరియాల వెంకట్రావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ భరత్ గౌరవ్ ప్రసన్న లక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది రేబాల కోటేశ్వర రావుకి, స్విమ్మింగ్‌లో తన ప్రతిభని చాటుకుని ఒలంపిక్స్ లో స్థానం సంపాదించిన ఆర్.ఆకాష్ కి పలువురు జానపద కళాకారులకు ఈ సందర్భంగా ఆమె సన్మానం చేశారు.