ఏపీ మొత్తం రైల్వే విస్తరణ.. ఎక్కడెక్కడికి లైన్లు వస్తున్నాయంటే?

 కొండపల్లి నుంచి మైలవరం, తిరువూరు మీదుగా సత్తుపల్లి సమీపంలోని లంకపల్లికి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అవకాశం? 

ఏపీకి( Andhra Pradesh) గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర రైల్వే శాఖ. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటికి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్ సిద్ధం చేసే పనిలో ఉంది.

ఇది పూర్తి కాగానే ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశం ఉంది. 11 రైల్వే లైన్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. డిపిఆర్ సిద్ధం చేసే పనిలో పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలుమార్గాల్లో రైళ్ల రద్దీ పెరిగింది. అందుకే ఆయారూట్లలో అవసరమైన చోట మూడు, నాలుగు, ఐదు, ఆరో లైన్ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. రైల్వే శాఖ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1960 కిలోమీటర్ల మేర.. కొత్త ప్రాజెక్టుల డిపిఆర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

* అసలు రైలు మార్గం లేని..

రాష్ట్రవ్యాప్తంగా రైలు మార్గం లేని పదకొండు ప్రాంతాల్లో కొత్త లైన్లు వేయాలని భావిస్తోంది రైల్వే శాఖ( railway department). దీనికి గతంలోనే సర్వే నిర్వహించింది. అందుకే ఇప్పుడు