ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు

 కావలి ఆర్టీవో మురళీధర్

 ప్రమాదాలు నివారణ కు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కావలి రవాణా శాఖ అధికారి మురళీధర్ పేర్కొన్నారు. నూతన కావలి రవాణా అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా  కావలి రవాణా అధికారి మురళీధర్ మాట్లాడుతూ కావలి  రోడ్డు ప్రమాదాలు నివారణలో భాగంగా  ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ మంజూరులో  మధ్య వత్తులును నమ్మకుండా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుని  అధికారికంగా  డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చని ఆయన అన్నారు. ప్రభుత్వ చేపట్టిన దిశా నిర్దేశను  అమలు చేయుటకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రజలు సమస్యలు ఎదురైతే  నేరుగా తన వద్దకు రావచ్చు అని ఆయన తెలిపారు.