సూళ్లూరుపేట లో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పర్యటన.
సూళ్లూరుపేట లో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పర్యటన.  
నెల్లూరుజిల్లా.  సూళ్లూరుపేట:- మున్సిపాలిటీ పరిధి లోని మన్నారుపోలూరు లో నవరత్నాలు  పేదలందరికీ ఇల్లు కార్యక్రమం లో భాగంగా నిర్మిస్తున్న YSR జగనన్న కాలనీ  లోని ఇళ్ల నిర్మాణాలను గురువారం జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సందర్శించి  పరిశీలించారు.లబ్దిదారులను కలుసుకొని వారి సమస్యలను కూడా  కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు,ఇళ్ల నిర్మాణ సమయం లో తెచ్చుకుని ఉంచుకున్న  సామాగ్రి దొంగతనాలకు గురి అవుతున్నాయని, వాటికి రక్షణ కల్పించాలని కోరారు. ఇళ్ల నిర్మాణం కు రుణ సదుపాయం కల్పిస్తున్న ప్రభుత్వమే ఆ రుణం తో  ఇల్లు నిర్మించి ఇవ్వాలని కొందరు లబ్ధిదారులు కోరారు, ఈ సందర్భముగా  కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం కు స్వచ్చందంగా ముందుకు  వచ్చిన వారికి ప్రభుత్వం బ్యాంకర్స్ ద్వారా పావలా వడ్డీకి రుణాలు అందిస్తుందని,  జిల్లా లో నవరత్నాలు ద్వారా లక్షా డెబ్భై ఐదు వేల కుటుంబాలకు పట్టాలు ఇవ్వడం  జరిగిందని , ఇటీవల కురిసిన బారి వర్షాలు కారణముగా హోసింగ్ కార్యక్రమం ఆలస్యం  కావడం జరిగిందని తిరిగి అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయము తో పునరుద్ధరిస్తూ  ముందుకు పోవడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేసారు, ఈ కార్యక్రమం లో నాయుడుపేట RDO సరోజినీ ,పేట మునిసిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్, మునిసిపల్ చైర్మన్  దబ్బల శ్రీమంత్ రెడ్డి, మునిసిపల్ కౌన్సిలర్లు, ఇతర ప్రముఖులు ,అధికారులు  పాల్గొన్నారు.
  
  
  
  
  
