2026 మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులకు కావలసిన పూర్తి సమాచారం
2026 మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులకు కావలసిన పూర్తి సమాచారం
ఎవరు పోటీ చేయవచ్చు? (అర్హతలు)
అందరు అభ్యర్థులకు ఒకే అర్హతలు
1. భారత పౌరుడు కావాలి
2. కనీసం 21 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి
3. సంబంధిత మునిసిపల్ వార్డులో ఓటరు అయి ఉండాలి
4. ఏ కోర్ట్ ద్వారా అనర్హత (Disqualification) ఉండకూడదు
పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థికి కావలసినవి:
1. పార్టీ నుంచి అధికారిక టికెట్ అనగా పార్టీ B ఫామ్
2. బలపర్చే ఓటరు (Proposer) ఒక్కరు చాలు
3. పార్టీకి సంబందించిన ఎలక్షన్ సింబల్ వస్తుంది
4. నామినేషన్ ఫారమ్ + అఫిడవిట్
స్వతంత్ర (Independent) అభ్యర్థి (ఏ పార్టీకి చెందకుండా పోటీ చేసే వారు) కావలసినవి:
1. 10 మంది బలపర్చే వారు ఏ వార్డ్ కి పోటీ చేస్తున్నారో ఆ వార్డ్ కి సంబందించిన ఓటర్లు (Proposers) సంతకాలు
2. పార్టీ సింబల్ ఉండదు
3. ఎన్నికల అధికారి ఇచ్చే ఫ్రీ సింబల్ ఎంచుకోవాలి
4. నామినేషన్ ఫారమ్ + అఫిడవిట్
నామినేషన్ వేయడానికి కావలసిన డాక్యుమెంట్స్
1. నామినేషన్ ఫారమ్ (ఎన్నికల అధికారి వద్ద నుండి పొందినది)
2. అఫిడవిట్ (ఆస్తులు, కేసులు వివరాలు)
3. పోటీ చేయు అభ్యర్థి ఓటర్ ఐడీ / ఆధార్ కార్డు
4. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు (అవసరానికి తగ్గట్టు)
5. పార్టీ అభ్యర్థి అయితే – పార్టీ లెటర్ (B ఫామ్)
6. డిపాజిట్ (జమ చేయాల్సిన మొత్తం) ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం నిర్ణయిస్తారు. సాధారణంగా నామినేషన్ సమయంలో చెల్లించాలి
7. ఓట్లు తక్కువ వస్తే డిపాజిట్ జప్తు అవుతుంది.
(ఎలక్షన్ షెడ్యూల్)
1. నోటిఫికేషన్ విడుదల
2. నామినేషన్ చివరి తేది
3. స్క్రూటినీ (నామినేషన్ పరిశీలన)
4. ఉపసంహరణ
5. పోలింగ్
6. కౌంటింగ్
పైవన్నీ ఇవన్నీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తుంది
ముఖ్యంగా గుర్తుంచుకోవాలసినవి
1. పార్టీ అభ్యర్థికి → 1 ప్రపోజర్
2. స్వతంత్ర అభ్యర్థికి → 10 మంది ప్రపోజర్లు
3. ప్రొపోజర్ తప్పకుండా ఏ వార్డ్ కి సంబందించిన వారు అదే వార్డ్ ఓటరు లిస్ట్‌లో పేరు తప్పనిసరి
4. పోటీ చేయు అభ్యర్థి కి మునిసిపల్ పరిధిలో ఓటు ఏ వార్డ్ లో ఉన్న అదే వార్డ్ లో లేదా ఇతర వార్డ్ లో పోటీ చేయవచ్చును, కానీ ఏ వార్డ్ కి పోటీ చేస్తే అదే వార్డ్ కి సంబందించిన ప్రొపోజర్ (బలపరచే) వ్యక్తి ఉండాలి.
5. పార్టీ పరంగా అయితే ఒక్కరు
6. స్వతంత్ర అభ్యర్థి కి 10 మంది తప్పనిసరి సంతకం చెయ్యాలి
7. ఒక పోటీ చేసే అభ్యర్తికి ప్రొపోజర్ గా సంతకం పెట్టిన వ్యక్తి అదే వార్డ్ లో పోటీ చేసే మరొక అభ్యర్థి కి ప్రొపోజర్ గా చెయ్యకూడదు, ఒకవేళ అలా చేస్తే నామినేషన్ తిరస్కరించబడుతుంది.
8. నామినేషన్‌లో చిన్న చిన్న తప్పులు కూడా తిరస్కరణకు కారణం అవుతాయి.
మునిసిపల్ ఎన్నికలు – ఖర్చు పరిమితి
1. పార్టీ అభ్యర్థి అయినా
2. స్వతంత్ర అభ్యర్థి అయినా
ఇద్దరికీ ఖర్చు పరిమితి ఒకేలా ఉంటుంది
మునిసిపాలిటీ రకం – ఖర్చు పరిమితి
1. నగర పంచాయతీ లకు 2 లక్షలు వరకు
2. గ్రేడ్–III మునిసిపాలిటీ 3 లక్షలు వరకు
3. గ్రేడ్–II మునిసిపాలిటీ 4 లక్షలు వరకు
4. గ్రేడ్–I మునిసిపాలిటీ 5 లక్షలు వరకు
5. మునిసిపల్ కార్పొరేషన్ 10 లక్షలు వరకు
ఖచ్చితమైన మొత్తాన్ని ప్రతి ఎన్నికకు ముందు స్టేట్ ఎలక్షన్ కమిషన్ (SEC) అధికారికంగా ప్రకటిస్తుంది.
ఖర్చు అంటే ఏమేమి వస్తాయి?
ఈ క్రింది ఖర్చులన్నీ ఎన్నికల ఖర్చులో లెక్కిస్తారు.
1. ఫ్లెక్సీలు, బ్యానర్లు
2. కరపత్రాలు, పోస్టర్లు
3. వాహనాల అద్దె
4. మైక్ / డీజే
5. సభలు, సమావేశాల ఖర్చు
6. సోషల్ మీడియా ప్రచారం
7. కార్యకర్తలకు భోజనం, నీరు
8. పార్టీ చేసిన ఖర్చు కూడా అభ్యర్థి ఖర్చుగానే లెక్క
ఖర్చుల రిజిస్టర్ ఏవిధంగా వ్రాయాలి
1. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగ ఎన్నికల ఖర్చుల రిజిస్టర్ నిర్వహించాలి
2. ఎన్నికల అధికారికి మధ్యలో, ఎన్నికల తర్వాత 30 రోజులలోపు రిజిస్టర్ తప్పక చూపించాలి.
ఖర్చుల పరిమితి మించితే ఏమవుతుంది
1. ఎన్నిక రద్దు కావచ్చు
2. డిస్క్వాలిఫికేషన్ అయ్యే అవకాశం
3. భవిష్యత్తు ఎన్నికల్లో నిషేధం.
ముఖ్యంగా గుర్తుంచుకోవాలసినవి.
1. పార్టీ అభ్యర్థికి ప్రత్యేక సడలింపు లేదు
2. స్వతంత్ర అభ్యర్థికీ అదే పరిమితి
3. ఖర్చులపై అధికారులు గట్టి నిఘా
4. ప్రతి రూపాయి లెక్కలో ఉంటుంది
ఎన్నికల ఖర్చు లెక్కలోకి రాని ఖర్చులు
1. పార్టీ ఆఫీస్ సాధారణ నిర్వహణ ఖర్చులు
2. ప్రచారం కోసం ప్రత్యేకంగా చేయనప్పుడు మాత్రమే
3. పార్టీ ఆఫీస్ అద్దె
4. పార్టీ ఆఫీస్ కరెంట్ బిల్లు
5. పార్టీ ఆఫీస్ స్టాఫ్ జీతాలు
కానీ:
1. పార్టీ ఆఫీస్ నుంచే అభ్యర్థి కోసం ప్రత్యేక ప్రచారం చేస్ ఆ ఖర్చు అభ్యర్థి ఖర్చులోకి వస్తుంది.
2. స్వయంగా వచ్చే మద్దతుదారుల ఖర్చు అభ్యర్థి చెప్పకుండా, తనంతట తానే వచ్చిన మద్దతుదారుల ఖర్చు, వారి ప్రయాణ ఖర్చులు, వారి భోజన ఖర్చులు, కానీ: అభ్యర్థి ఏర్పాటు చేస్తే → ఖర్చులోకి వస్తుంది
3. అభ్యర్థి వ్యక్తిగత జీవన ఖర్చులు ఎన్నికలకు సంబంధం లేని ఖర్చులు అనగా ఇంటి అద్దె, ఇంటి కరెంట్ / నీటి బిల్లులు, కుటుంబ భోజన ఖర్చులు, పిల్లల చదువు ఖర్చులు
4. మత / సంప్రదాయ కార్యక్రమాల ఖర్చులు ఎన్నికల ప్రచారం చేయనప్పుడు మాత్రమే, పూజలు, పెళ్లి / శుభకార్యాలు, అంత్యక్రియలు కానీ: అక్కడ కూడా ఎన్నికల ప్రచారం చేస్తే → ఖర్చులోకి వస్తుంది
అభ్యర్థి అనుమతితో లేదా ఆదేశంతో జరిగిన ప్రతి ఖర్చు, ఖచ్చితంగా ఖర్చు లెక్కలోకి వస్తుంది, “పార్టీ చేసింది” అన్న కారణం చెప్పి తప్పించుకోలేరు
ఎన్నికల అధికారులు ఏమి చెక్ చేస్తారు?
1. నామినేషన్ పేపర్లు
అధికారులు మొదటగా చూసేది
ఇదే
2. అభ్యర్థి అర్హతలు (వయస్సు, ఓటరు నమోదు)
3. నామినేషన్ ఫారమ్ సరిగా నింపారా?
4. ప్రపోజర్ అర్హుడేనా?
5. పార్టీ అభ్యర్థి అయితే – పార్టీ అథారైజేషన్ లెటర్ ఉందా?
6. అఫిడవిట్ పూర్తిగా ఇచ్చారా?
చిన్న తప్పు ఉన్నా నామినేషన్
తిరస్కరణకు అవకాశం
ఉంటుంది
ఎన్నికల ఖర్చుల తనిఖీ
ఇది చాలా ముఖ్యమైన భాగం
1. ఖర్చుల రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా?
2. ప్రతి ఖర్చుకు బిల్ / రసీదు ఉందా?
3. ఖర్చు పరిమితి దాటిందా?
4. పార్టీ చేసిన ఖర్చు మీ ఖర్చులో చూపించారా?
5. సోషల్ మీడియా ఖర్చులు చూపించారా?
6. వాహనాలు & ప్రచారం
ఎన్ని వాహనాలు
వాడుతున్నారు? అనుమతి
తీసుకున్నారా? వాహనాలపై
ఫ్లెక్సీలు అనుమతి మేరకే
ఉన్నాయా? ర్యాలీలు, రోడ్ షోలు
అనుమతి తీసుకున్నారా?
ప్రచార సామగ్రి
1. అనుమతితోనే పెట్టారా?
2. ప్రభుత్వ ఆస్తులపై పెట్టారా? (అలా చేస్తే నేరం)
3. పరిమాణం, సంఖ్య అనుమతి మేరకేనా?
4. ముద్రణ వివరాలు (Printer name) ఉన్నాయా?
5. సభలు, సమావేశాలు
6. సభకు ముందే అనుమతి తీసుకున్నారా?
7. మైక్ / డీజే టైమ్ పరిమితిలోనేనా?
8. ఓటర్లకు డబ్బులు, వస్తువులు పంచారా?
9. మద్యం పంపిణీ జరిగిందా?
సోషల్ మీడియా ప్రచారం
1. ఫేస్‌బుక్ / వాట్సాప్ / యూట్యూబ్ ప్రచారం
2. పెయిడ్ యాడ్స్ ఉన్నాయా? వాటి ఖర్చు రిజిస్టర్‌లో చూపించారా?
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)
1. ప్రభుత్వ పథకాలను ప్రచారానికి వాడారా?
2. అధికారులను ప్రభావితం చేశారా?
3. మత / కుల ప్రాతిపదికన ప్రచారం చేశారా?
4. ప్రత్యర్థులపై అసభ్య వ్యాఖ్యలు చేశారా?
పోలింగ్ రోజు
1. బూత్ దగ్గర ప్రచారం చేశారా?
2. ఓటర్లను ప్రభావితం చేశారా?
3. డబ్బులు, గిఫ్ట్స్ ఇచ్చారా?
4. బూత్ క్యాప్చరింగ్ ఉందా?
ఎన్నికల తర్వాత
1. ఖర్చుల పూర్తి లెక్క సమర్పించారా?
2. నిర్ణీత గడువులో ఇచ్చారా?
3. లెక్కల్లో తేడాలు ఉన్నాయా?
తప్పులు చేస్తే ఏమవుతుంది?
1. నోటీసులు
2. జరిమానా
3. ఎన్నిక రద్దు
4. డిస్క్వాలిఫికేషన్
కావున రాబోయే 2026 మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులు తప్పక ఈ నియమ నిబంధనలు పాటించి మీ యొక్క ఎన్నిక రద్దు కాకుండా జాగ్రత్త లు తీసుకొని విజయం పొందాలని ఆశిస్తూ....