సర్వేపల్లి అభివృద్దిలో కీలక మలుపు 










ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సీఎస్సార్ నిధులతో సంపూర్ణ సహకారం అందిస్తున్న SEIL కంపెనీ. మొన్న పొదలకూరులో డయాలసిస్ సెంటర్...నిన్న వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు..నేడు బ్రహ్మదేవంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మొదటి దశలో రూ.20 కోట్లతో ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో హాస్పిటల్ నిర్మాణానికి ముందుకొచ్చిన SEIL. 30 పడకలతో నిర్మిస్తున్న ఆస్పత్రిలో ప్రజలకు వైద్యసేవలతో పాటు మెడికల్ టెస్టులు కూడా ఉచితమే  సోమిరెడ్డి ప్రత్యేక వినతితో ఆస్పత్రి స్థాయిని 50 పడకలకు పెంచేందుకు కూడా సన్నాహాలు  ఆస్పత్రి ప్రాంగణంలోకి రోగి ప్రవేశించి కోలుకుని బయటకు వెళ్లే వరకు అన్నీ ఉచితమే...భోజనం కూడా SEIL ఆధ్వర్యంలోనే 

నర్సింగ్ కళాశాలలో విద్యార్థినులకు ఉచిత శిక్షణ  రేపు ఉదయం 11 గంటలకు(గురువారం) బ్రహ్మదేవంలో SEIL కంపెనీ ఆధ్వర్యంలో ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ టెండర్ ప్రక్రియ పూర్తి అయ్యాక శంకుస్థాపన  సీఎస్ఆర్ నిధుల సద్వివినియోగంలో విజయవంతంగా ముందుకు సాగుతున్న సోమిరెడ్డి SEIL కంపెనీ సీఎస్ఆర్ నిధులతో సర్వేపల్లిలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు

రూ.1.30 కోట్లతో డయాలసిస్ యూనిట్లో 3 బెడ్లు, పొదలకూరు, వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యాధునిక స్కానర్లు, వాటర్ ప్లాంటు, కంప్యూటర్లు, జనరేటర్లు తదితర పరికరాలు 

రూ.2.10 కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా 42 వాటర్ ప్లాంట్లు, పొదలకూరు, వెంకటాచలం పంచాయతీల్లో రూ.3.10 సోలార్ లైట్ల ఏర్పాటుకు చర్యలు ఐదు మండలాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న  8,9 తరగతుల విద్యార్థినులు 1875 మందికి రూ.95 లక్షలతో సైకిళ్ల పంపిణీకి సన్నాహాలు  మల్లికార్జునపురం గిరిజన కాలనీని దత్తత తీసుకుని గిరిజనుల ఆర్థిక అభ్యున్నతికి ప్రోత్సాహం