మహిళ రక్షణకు "శక్తి" యాప్ ఒక ఉక్కు కవచం..!

మహిళా రక్షణ మా ప్రధాన బాధ్యత..

జలదంకి ఎస్సై సయ్యద్ లతీఫున్నిసా..


మహిళ రక్షణకు "శక్తి" యాప్ ఒక ఉక్కు కవచంఅని మహిళా రక్షణ మా ప్రధాన బాధ్యత అంటూ ప్రతి ఒక్క మహిళ మొబైల్ లో "శక్తి" యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపదలో ఉన్న మహిళలు ఎవరైనా ఎస్.ఓ.ఎస్ బటన్ నొక్కిన వేంటనే వారు ఉన్న ప్రాంతం వివరాలు దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కు, డయల్ 112 నెంబర్ కు చేరుతుందని  వెంటనే పోలీసులు అప్రమత్తమై సంఘటన స్థలానికి చేరుకొని వారికి రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని జలదంకి ఎస్సై సయ్యద్ లతీఫున్నిసా తెలిపారు..

మహిళల భద్రత, సైబర్,  సోషల్ మీడియా మోసాలు, దొంగతనాల నివారణపై నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల, కావలి డిఎస్పి వి.వి రమణకుమార్, కలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.సుబ్బారావు, పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు..

అందులో భాగంగా గురువారం మండల కేంద్రమైన జలదంకి లోని  సంఘమిత్ర వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి శ్రీధర్ బాబు, శక్తి టీం కావలి సబ్ డివిజన్ ఇన్చార్జి ఎస్ఐ గోపిచంద్ లతో కలిసి ఎస్సై సయ్యద్ లతీఫున్నిసా మహిళలకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియా వేధింపులు, ఆన్‌లైన్ మోసాలు, దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని మహిళలకు ఎస్ఐ సూచించారు. సోషల్ మీడియా, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు..

 ప్రేమ మోసాలు - అప్రమత్తత పై మాట్లాడుతూ సోషల్ మీడియా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వచ్చే పరిచయాలు, ఆన్‌లైన్ చాటింగ్ లతో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం/ఫోటోలు షేర్ చేయవద్దని చెప్పారు. బ్యాంకింగ్ మోసాలు పై తెలియని వ్యక్తుల నుండి వచ్చే లింకులు క్లిక్ చేయడం, ఓటిపి లు, బ్యాంక్ పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పకూడదన్నారు. రక్షణ యాప్స్ గురించి చెపుతూ ఆపద సమయంలో తక్షణ పోలీసు సహాయం కోసం ప్రభుత్వం రూపొందించిన శక్తి యాప్  ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.. 

దొంగతనాలు, చైన్ స్నాచింగ్ నివారణ చర్యల పై మాట్లాడుతూ ఇంటి దొంగతనాలు పగటిపూట లేదా రాత్రి సమయాల్లో ఇళ్లకు తాళాలు వేసి ఊరికి వెళ్లే మహిళలు కుటుంబాలు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. రద్దీ ప్రదేశాలలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు,  రద్దీగా ఉండే ప్రాంతాలలో మహిళలు తమ బంగారు ఆభరణాలు, నగదు పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని , అలాంటి వ్యక్తులు వచ్చి అడ్రస్ అడగడం, లేదా మాటల్లో పెట్టి మోసగించడం వంటివి జరిగినప్పుడు తక్షణమే పోలీసులను సంప్రదించాలన్నారు..

ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా సైబర్ నేరాలు, వేధింపులు ఎదురైతే మహిళలు తక్షణమే 112, 1098 పిల్లల రక్షణకు, 1930 సైబర్ హెల్ప్‌లైన్ లను లేదా 100 కు డయల్ చేసి సహాయం పొందవచ్చునని ఎస్సై లతీఫున్నిసా మహిళలకు అవగాహన కల్పించారు..

ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ హరిబాబు, రమణ, మహిళా పోలీసులు అనూష, కామేశ్వరి, సాయి కుమారి, శ్రీలక్ష్మి, సిసిలు, మండలం లోని పొదుపు సంఘాల మహిళలు, విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ లు, సంఘమిత్ర సభ్యులు, తదితరులు పాల్గొన్నారు..