సూళ్లూరుపేట లో ఘనంగా ప్రారంభమైన పసుపు పండుగ.
సూళ్లూరుపేట లో ఘనంగా ప్రారంభమైన పసుపు పండుగ.
టిడిపి మహానాడుకు హాజరైన పలువురు నేతలు.
ఘనంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు.
రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బుధవారం తెలుగుదేశం పార్టీ మహానాడు పసుపు పండుగ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సూళ్లూరుపేట పట్టణ 7,8 క్లస్టర్లకు సంబంధించి మహానాడు ఏర్పాట్లు చేశారు.రాష్ట్ర మహానాడును వర్చువల్ విధానంలో నిర్వహించనుండడంతో పార్టీ నేతలు,ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు మహానాడు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు,పార్టీ నిర్ణయాలు,తీర్మానాలు,చర్చలను వీక్షించి తెలుసుకునేలా భారీ ఎల్ ఇ డి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మహానాడు ప్రారంభోత్సవం సందర్భంగా తొలుత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి ఎమ్మెల్యే, ఏఎంసి చైర్మన్ మరియు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు లాయర్ సుధాకర్ రెడ్డి, ఏజి కిషోర్, పచ్చవ మాధవ నాయుడు మరియు తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.