బక్రీద్ ప్రార్థనలో వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న.. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
బక్రీద్ ప్రార్థనలో వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న.. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
నెల్లూరు సంతపేట ఈద్గా మసీదులో.. వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు.. ముస్లిం సోదరులతో కలిసి బక్రీద్ పండుగ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వారు ముస్లిం సోదరులను ఆప్యాయంగా.. పలకరించి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
* అల్లా త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను.. ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అన్నారు.
* ముస్లిం సోదర సోదరీమణులు ప్రతి ఒక్కరు బక్రీద్ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ..
* నెల్లూరు నగరంతో పాటు ప్రపంచవ్యాప్తంగా.. ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
* ఈరోజు సంతపేట ఈద్గా మసీదులో జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ముస్లిం మత పెద్దలు, వైఎస్ఆర్సిపి మైనార్టీ నాయకులతో కలిసి.. బక్రీద్ ప్రార్థనలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
* త్యాగానికి ప్రత్యేకగా జరుపుకునే బక్రీద్ పండుగను ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
* మనకున్న దానిలో కొంత సమాజానికి దానం చేసి.. తోటి వారికి సహాయ పడడం..ప్రతి ఒక్కరు.. సమానమేనన్న భావనను చాటడం.. బక్రీద్ పండుగ సూచిస్తుందన్నారు.
* ప్రజలు ఒక్కరికి అల్లా ఆశీస్సులు మెండుగా ఉండి.. సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
* మైనార్టీల సంక్షేమం ఉంటే గుర్తొచ్చేది వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు.
* ముస్లిం మైనార్టీల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు,YS జగన్మోహన్ రెడ్డి గారు చేసిన.. సేవలు, అభివృద్ధి పనులను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటూ ఉంటారని అన్నారు.
• ఈరోజు భారతదేశంలో మైనారిటీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనని సగర్వంగా చెప్పవచ్చు.
• అల్లా ఆశీస్సులు, వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ ఉండాలని చంద్రశేఖర్ రెడ్డి గారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు, వైఎస్ఆర్సిపి నేతలు పాల్గొన్నారు.