నెల్లూరు జిల్లాలో ఇద్దరు యువకుల హత్య
నెల్లూరు జిల్లాలో ఇద్దరు యువకుల హత్య
కొడవలూరు మండలం గండవరం మెయిన్ రోడ్డుపై దారుణం జరిగింది. గడ్డి మిషన్ కోసం డీజిల్ తీసుకువెళ్తున్న వెంకటేష్ (పెద్ద పుత్తేడు), బాల వెంకయ్య (సంగం మండలం) అనే ఇద్దరిని దుండగులు కత్తులతో నరికి చంపారు. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తుండగా జరిగిన ఈ దాడితో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పాత కక్షలే కారణమని అనుమానిస్తున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.