అన్ని ప్రభుత్వ పాఠశాలలకు టెస్ట్ బుక్స్, నోట్ బుక్స్ పంపిణీ
అన్ని ప్రభుత్వ పాఠశాలలకు టెస్ట్ బుక్స్, నోట్ బుక్స్ పంపిణీ
రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట/తడ:-
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర పథకం కింద తడ మండల విద్యాశాఖ కార్యాలయం నుండి సోమవారం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు నోట్ బుక్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది
స్టూడెంట్ కిట్ లోని మిగిలిన కాంపోనెంట్స్ ఒక్కొక్కటి మండల స్టాక్ పాయింట్ కు చేరుకోవడం జరుగుతుందని, పాఠశాలలు తెరిచే నాటికి ముందుగా టెక్స్ట్ బుక్స్ , నోట్ బుక్స్ మండలంలోని అన్ని పాఠశాలలకు అందజేయడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారులు
మల్లికార్జున రావు, వేములు తెలియజేయడం జరిగింది. స్టూడెంట్ కిట్ లోని మిగిలినవి
యూనిఫామ్ , షూస్ ,బెల్ట్ , డిక్షనరీ, మొదలైనవి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నాటికి అన్ని పాఠశాలలకు అందజేయబడతాయని తెలియజేశారు.