ఆత్మకూరు, రవికిరణాలు :   ఆత్మకూరు పట్టణంలోని నూతనంగా ప్రారంభోత్సవం చేసిన బైపాస్ రోడ్డుపై ప్రతిరోజూ ఉదయం 06:00 గంటల నుండి 08:00 గంటల వరకు మరియు సాయంత్రం 04:30 గంటల నుండి 06:00 గంటల వరకు వాకర్స్ సౌకర్యార్థం ఒకవైపు మార్గాన్ని మూసివేయడం జరుగుతుందని సీఐ గంగాధర్ తెలిపారు.  ఈ సమయాల్లో వాకర్స్ రోడ్డు మార్గంలో సురక్షితంగా నడిచేందుకు వీలుగా ఈ ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని కావున, ఆయా సమయాల్లో బైపాస్ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి, సూచించిన కుడివైపు మార్గంలో రాకపోకలు సాగించాలని,

ఒకే మార్గంలో ఎదురెదురుగా వాహనాలు ప్రయాణించే పరిస్థితి ఉన్నందున, వాహనదారులు అప్రమత్తంగా ఉండి, వాహనాలను నెమ్మదిగా నడపాలని,ఇతర వాహనాలకు, వాకర్స్‌కు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రయాణించాలని సూచించారు. ప్రజల భద్రత, వాకర్స్ సౌకర్యం దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ ట్రాఫిక్ విధానానికి వాహనదారులు, స్థానిక ప్రజలు సహకరించాలని ఆత్మకూరు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.