ప్రియురాలిని ముక్కలుగా నరికింది ఇతడే..
విశాఖలో ప్రియురాలు మౌనికను(29) ముక్కలుగా నరికిన నిందితుడు రవీంద్ర ఫొటో బయటికొచ్చింది. డేటింగ్ యాప్‌లో మొదలైన వీరి పరిచయం తర్వాత వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈక్రమంలోనే ఇప్పటివరకు ఆమెకు రూ.3.50లక్షలు ఇచ్చినట్లు రవీంద్ర పోలీసులకు చెప్పాడు. నిన్న కూడా నేవీ ఐడీ కార్డు తీసుకొని డబ్బులు డిమాండ్ చేయడంతో చంపేసినట్లు అంగీకరించాడు. హత్య కోసం ఆన్‌లైన్‌లో కత్తి, క్లీనింగ్ సామగ్రి కొన్నాడు.