ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు


తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. APR-1 వరకు వసంతమండపంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ 3 రోజులూ స్వామివారిని మాడవీధుల్లో ఊరేగిస్తారు. రేపు ఉ.8-10 మధ్య స్వర్ణరథంపై శ్రీవారి తిరువీధిని చూసేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ మూడు రోజులూ కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలతో పాటు రేపటి అష్టదళ పాద పద్మారాధన సేవను TTD రద్దు చేసింది.