సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం.

రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-


ఈ సంఘటన 25.05.2026న మధ్యాహ్నం 2.50 గంటలకు ముందు సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌లోని 1వ నంబర్ ప్లాట్ ఫామ్ వద్ద మధ్యాహ్నం సమయంలో ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని రైల్వే పోలీసులు కనుగొన్నారు. సూళ్లూరుపేట జిఆర్పి పోలీసుల వివరాలు మేరకు రైల్వే స్టేషన్‌లో డ్యూటీలో ఉన్న ఆర్పీఎఫ్ హెచ్‌సీ రమేష్ కుమార్ సుల్లూరుపేట ఆర్ఎస్ ఆరోగ్య కేంద్రం సమీపంలో ఉన్న పీఎఫ్ నెం.01 వద్ద సుమారు 54 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించారు. వెంటనే 108 అంబులెన్స్‌లో చికిత్స కోసం సుల్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డ్యూటీలో ఉన్న వైద్య అధికారి డా. సి.హెచ్. రమేష్  ఆసుపత్రిలో తనిఖీచేయగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించిన తరువాత, మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జి ఆర్ పి పోలీసులు తెలిపారు.