జూన్ 1వ తేదీన తడలో బడి పిలుస్తోంది కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు.

 రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట/తడ న్యూస్ :-


 మండలంలో జూన్ 1వ తేదీన   " బడి పిలుస్తోంది" కార్యక్రమాన్ని మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులతో ఘనంగా నిర్వహించునున్నట్లు అందుకు ముందస్తుగా సన్నాహక సమావేశంను స్థానిక ప్రభుత్వ  ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యూనియన్ బాధ్యులు, జన విజ్ఞాన వేదిక నాయకులు  మరియు సి ఆర్ ఎం టి  లతో మండల విద్యాశాఖ అధికారులతో మంగళవారం సమావేశం  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సెక్టోరియల్ అధికారులు, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్న సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకుని ఉన్నందున అందరూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు , విద్యార్ధులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేరేవిధంగా చేయాలని ఎంఈఓ 1 కె జె వేములు, ఎంఈఓ 2  కె మల్లికార్జున రావు  కోరడం జరిగినది.అదేవిధంగా మండల స్థాయి అధికారులతో రానున్న రెండు రోజుల్లో తడ తాహసిల్దార్ కె రవికుమార్, ఎండిఓ శేఖర్ నాయక్  అధ్యక్షతన మండలంలోని గ్రామ పెద్దలు, నాయకుల తో  ఎండిఓ ఆఫీసు నందు సమావేశం నిర్వహించి తలపెట్టామని  మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు.