దువ్వూరు మునిశేఖర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కాకాని పూజిత
దువ్వూరు మునిశేఖర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కాకాని పూజిత.
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
వైఎస్సార్సీపీ స్టేట్ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ దివంగత దువ్వూరు మునిశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ నేత కాకాని పూజిత పరామర్శించారు. ఈ సందర్భంగా సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తో కలిసి మునిశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మునిశేఖర్ రెడ్డి అకాల మరణం పార్టీకి, కార్యకర్తలకు తీరని లోటని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మునిశేఖర్ రెడ్డి కి ఘన నివాళులు అర్పించారు.