నూతన ఎంఈఓ 1 గా రమేష్ బాధ్యతల స్వీకరణ
నూతన ఎంఈఓ 1 గా రమేష్ బాధ్యతల స్వీకరణ
నెల్లూరు [వింజమూరు], రవికిరణాలు జూలై 31 :
వింజమూరు మండల విద్యాశాఖ అధికారిగా పోలుబోయిన రమేష్ ఎంఈఓ 1 గా బాధ్యతలు స్వీకరించారు గతంలో అయినా మండలంలోని చాకలికొండ ఆర్కే ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులుగా పని చేశారు తదుపరి కలిగిరి దుత్తలూరు వరికుంటపాడు మండలాల ఎంఈఓ వన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన వింజమూరు ఎంఈఓ 1 గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎంఈఓ 2 మధుసూదన్ రెడ్డి ఎంఆర్సి సిబ్బంది ఆయనను ఘనంగా శాలువా పూలమాలతో సన్మానించారు అలాగే ప్రస్తుతం వింజమూరు తో పాటు వరికుంటపాడు మండలం ఎంఈఓ వన్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలైనా సర్వీస్ రిజిస్టర్ ఇతర సమస్యలను సాధ్యమైనంత మేర త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మౌనిక శ్రీహరి మధు తదితరులు ఉన్నారు.