ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగపరచుకోండి మల్లినేని వేణుగోపాల్ నాయుడు, ఉప సర్పంచ్.





నెల్లూరు [రూరల్], రవికిరణాలు జూలై 30 : 

స్మార్ట్ విజన్ కంటి ఆసుపత్రి మరియు కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (పియంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా) సౌజన్యంతోనెల్లూరు రూరల్ మండలం  ఆమంచర్ల గ్రామంలోని రైతు భరోసా కేంద్రం నందు మల్లినేని వేణుగోపాల్ నాయుడు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరాన్ని ప్రారంభించిన గ్రామ ఉప సర్పంచ్ మల్లినేని వేణుగోపాల్ నాయుడు మాట్లాడుతూ...

 నేటి ఆధునిక జీవన విధానంలోకంటి వ్యాధుల పట్ల అవగాహన లోపించిందని, చిన్నపిల్లలు స్మార్ట్ ఫోన్లకు బానిసలు అవుతూ కంటి వ్యాధులు కొని తెచ్చుకుంటున్నారని, అలాగే యువతీ, యువకులు సెల్ ఫోన్లు, టీవీలకు అలవాటు పడి కంటి వ్యాధుల బారిన పడుతున్నారని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు 50 సంవత్సరాలు పైబడిన వారు కంటి సమస్యతో బాధపడుతున్నారని, ఇలాంటి వారి పట్ల ఉచిత కంటి వైద్య సేవలు అందించడానికి స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ సహకారంతో ఈరోజు 50 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని, అందులో 20 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించి వారిని స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ కి తరలించి కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మందులు అవసరమైన వారికి ఉచితంగా మందులని పంపిణీ చేయడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పి.హెచ్.పి జిల్లా నాయకులు శాఖవరపు వేణుగోపాల్, దేవరకొండ శ్రీనివాసులు, వేగూరు హనుమంతరావు, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ మేనేజర్ కే.రాంబాబు, టెక్నీషియన్ డి.నాగేశ్వరి, సిహెచ్.వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.