12వ పి.ఆర్.సి వెంటనే ప్రకటించాలి మున్సిపల్ కార్మికుల ర్యాలీ ధర్నా
12వ పి.ఆర్.సి వెంటనే ప్రకటించాలి మున్సిపల్ కార్మికుల ర్యాలీ ధర్నా.
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సెప్టెంబర్ 18:-
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కార్మికులు సూళ్లూరుపేట పట్టణంలోని సిఐటియు ఆఫీసు వద్ద నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలి నిర్వహించి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. 12వ పిఆర్సి ప్రకటించాలని, మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డీపల్లి చెంగయ్య మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి 12వ పిఆర్సి అమలు చేసి మున్సిపల్ కార్మికులకు వర్తింపచేయాలని, గత జులై నెలలో సమ్మె కాలపు వేతనం వెంటనే వేయాలని, గత 17 రోజుల సమ్మె కాలంపు ఒప్పందాలు అన్నిటికీ వెంటనే జీవోలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలకి సంబంధించి జీవో వెంటనే విడుదల చేయాలని,రిటైర్మెంట్ అయిన వారికి మరణించిన వారికి అనారోగ్యం పాలైన వారికి వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని, పర్మినెంట్ కార్మికులకు డిఏ సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలని, పట్టణాల విస్తరణ మేరకు సిబ్బంది సంఖ్యను పెంచాలని, కార్మికులపై పనిభారం తగ్గించాలని, దహన సంస్కారాలకు సంబంధించి 15 వేల నుండి 20 వేలకు పెంచుతూ కుదిరిన ఒప్పందం అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ జీవో వెంటనే ఇవ్వాలని, ఎన్ఎంఆర్ బదిలీ కోవిడ్ క్లాప్ డ్రైవర్లకు 21 వేల రూపాయలు జీతం చెల్లించాలని . ఎక్స్గ్రేషియా ఐదు లక్షల నుండి ఏడు లక్షలకు పెంచాలని స్థానికంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిని కమీషనర్ జోక్యం చేసుకుని పరిష్కారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు చిన్నయ్య కార్యదర్శి చెంగయ్య నాయకులు వెంకటరత్నం రామయ్య వల్లెమ్మ, చంగమ్మ, గోపాల్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
.jpeg)







