శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు..!

జలదంకి ఎస్ఐ సయ్యద్ లతీ ఫున్నిసా..



జలదంకి మండలంలో రాత్రిపూట అనవసరంగా రోడ్లపై తిరుగుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు అని జలదంకి ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల ఆదేశాల మేరకు ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా తన సిబ్బందితో కలిసి మండలంలో రాత్రిపూట తనిఖీలు ముమ్మరం చేశారు. యువత బైకులతో రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతూ ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలపై తిరుగుతూ గొడవలు సృష్టించినా, అనుమానాస్పదంగా తిరిగినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు అవసరమైతే తప్ప రాత్రిపూట బయటకు రావద్దని తెలిపారు. మండలంలో 17 పంచాయతీల్లో షాపులు రాత్రి 10 గంటల తర్వాత విక్రయాలు నిర్వహిస్తే  కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఓపెన్ డ్రింక్, మద్యం సేవించి రోడ్లపై గొడవలు సృష్టిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఇక నుంచి తరుచూ ఇలాంటి డ్రైవ్‌లను నిర్వహిస్తామని తెలిపారు.  జలదంకి మండలాన్ని నేర రహిత మండలం గా తీర్చిదిద్దడానికి ప్రజలు సహకరించాలని కోరారు...