కరెంట్ ఆఫీస్ సెంటర్ లో విద్యార్థిని రాత్రి దారుణ హత్యా..
నెల్లూరు
కరెంట్ ఆఫీస్ సెంటర్ లో విద్యార్థిని రాత్రి దారుణ హత్యా..
బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తయిన మైధిలి ప్రియను కత్తితో పొడిచి చంపేసిన నిఖిల్..
మాట్లాడాలని రూముకి పిలిచి.. కత్తితో పొడిచి చంపిన స్నేహితుడు.. ఆపై పోలీస్ స్టేషన్లో లొంగుబాటు..
మృతదేహాన్ని నెల్లూరు మార్చురీకి తరలించిన పోలీసులు..
నిందితున్ని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్..
ఆగని కత్తి పోట్లు...గాల్లో కలిసి పోతున్న ప్రాణాలు..మానవ మృగాలు గా మారుతున్న యువత... కత్తి కల్చర్ పోయేది ఎప్పుడు?ప్రజల ప్రాణాలకు ముప్పు తప్పేది ఎప్పుడు
రాజకీయ నీడలో రౌడీ షీటర్లు అండతో కత్తులు పట్టిన వందల మంది మానవ మృగాలు,వీరితో ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజల ప్రాణాలకు పెనుముప్పు
రెండు రోజుల క్రితం గూడూరులో ఓ యువకుడిని అత్యంత దారుణంగా కత్తులతో నరికి చంపిన ఘటన మరొక ముందే నెల్లూరు నగరంలో ఓ యువతిని నమ్మించి అత్యంత కిరాతకంగా పొడిచి చంపిన ఘటన నెల్లూరు జిల్లా ప్రజల్లో తీవ్ర భయాందోళన రేకెత్తిస్తుంది
పోలీసు లాఠీలకు కౌన్సిలింగ్కు మానవ మృగాలు భయపడే పరిస్థితి పోయింది ఇక తూటాలకు పని చెప్పందే పరిస్థితి అదుపులోకి వచ్చేలా లేదు
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రజాస్వామ్యం శాంతి భద్రతలు పూర్తిస్థాయిలో గతి తప్పిన వేళ ఎంత ప్రయత్నించినా పోలీసులు లా అండ్ ఆర్డర్ ను అదుపులోకి తీసుకురావాలని ఎంత ప్రయత్నిస్తున్న కొన్ని సంవత్సరాలుగా వెళ్ళూనుకు పోయిన నేర సామ్రాజ్యం పై విజయం సాధించలేకపోతున్నారు
