సాడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హెచ్.ఐ.వి/ఎయిడ్స్ అవగాహన కార్యక్రమం
సాడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హెచ్.ఐ.వి/ఎయిడ్స్ అవగాహన కార్యక్రమం
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి సోకే మార్గాలు, అది ఏ విధంగా వ్యాపించదు అనే అంశాలపై ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, సుఖవ్యాధులు-వాటి చికిత్సా పద్ధతులు మరియు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవల గురించి సమగ్ర సమాచారాన్ని అందించారు. అలాగే బాధితులకు, సలహాలు పొందేందుకు అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 1097 వినియోగంపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి వైద్యులు, ఆప్సాక్స్ (APSACS) ప్రతినిధులు, సార్డ్స్ (SARDS) స్వచ్ఛంద సంస్థ సిబ్బంది మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
