విద్యార్థుల భవితకు ఎంపీ వేమిరెడ్డి భరోసా!
విద్యార్థుల భవితకు ఎంపీ వేమిరెడ్డి భరోసా!
ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలకు చేరాలి
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సోమవారం కావలి జవహర్ భారతి కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమంలో భాగంగా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భవిష్యత్తు, కెరీర్‌కు సంబంధించిన పలు ప్రశ్నలు అడగగా, ఎంపీ వేమిరెడ్డి సమాధానాలు ఇచ్చారు.
జిల్లాకు అనేక పరిశ్రమలు రానున్నాయని, తద్వారా అందుబాటులోకి వచ్చే ఉపాధి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సేవా కార్యక్రమాల పట్ల తనకు ప్రత్యేక ఆసక్తి ఉందని, అందులో భాగంగానే జిల్లావ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినయ్‌కుమార్‌రెడ్డి, కళాశాల కరస్పాండెంట్ ఎం. వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, డీన్ డాక్టర్ పి. సుబ్రహ్మణ్యం నాయుడు, డైరెక్టర్ డాక్టర్ ఆర్. మాల్యాద్రి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్తేర్ బ్యులా తదితరులు ఎంపీ వేమిరెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
.jpeg)
