నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 16 మున్సిపల్ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల కోసం "విజయదీపిక స్టడీ మెటీరియల్" పుస్తకాలను మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ వై.ఓ నందనలు బహూకరించారు.




కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో గురువారం వివిధ పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు కనబరచాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ మేనేజర్ రాజేశ్వరి ప్రధానోపాధ్యాయులు తిరుమలరాజు, రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.