నెల్లూరు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అబ్దుల్ ఫరాక్‌ను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు
నెల్లూరు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అబ్దుల్ ఫరాక్‌ను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు
ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇన్‌చార్జ్ మంత్రితో విస్తృతంగా చర్చించారు. కావలి పట్టణంలో మౌలిక వసతుల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ సమస్యలపై సమగ్రంగా వివరించారు. అలాగే కావలిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి, ఇందుకు అవసరమైన నిధుల మంజూరుపై చర్చించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరించేలా ప్రభుత్వ సహకారం అందించాలని ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి ఇన్‌చార్జ్ మంత్రిని కోరారు. దీనికి స్పందించిన ఇన్‌చార్జ్ మంత్రి అబ్దుల్ ఫరాక్, కావలి అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కావలిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.