మంత్రి గౌతమ్ రెడ్డి పి.ఎస్ గా అలీ అజ్గర్


ఐ.టి, పరిశ్రమలు & వాణిజ్య శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా ఆర్&బి విభాగం నెల్లూరు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ అలీ అజ్గర్ ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఉత్తర్వులు అందుకున్న అలీ అజ్గర్ మాట్లాడుతూ అహర్నిశలు శ్రమించే  మంత్రితో కలిసి పనిచేయడం బాధ్యతగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ పధకాలను, అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేసేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని తెలిపారు.