కీర్తిశేషులు రాములు 31వ వర్ధంతి సందర్భంగా కుమారులు కోరలు పేదలకు దోమతెరలు అన్నదాన కార్యక్రమం.




నెల్లూరు [కావలి], రవికిరణాలు జూలై 31 :

కావలి పట్టణంలో గురువారం నెల్లూరు పట్టణ నివాసులు కీర్తిశేషులు రాములు 31 వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు నెల్లూరు నివాసం ఉంటున్న కి శ్రీనివాసరావు- ఎన్సి లలిత, దంపతులు మరియు ఢిల్లీలో నివాసం ఉంటున్న కే. కనకారావు- విజయలక్ష్మి దంపతులు గురువారం కావలి పట్టణ బుడంగుంట గిరిజన కాలనీలో సుమారు 30 కుటుంబాల కు సంయుక్త సేవ సంస్థ ఆధ్వర్యంలో దోమతెరలు భోజనం ప్యాకెట్లు అందజేశారు. అనంతరం సంస్థ సీనియర్ సభ్యులు ఎంఈఎన్ ప్రసాద్ రావు షేక్ ఖాదర్బాషా, సంస్థ అధ్యక్షులు సురేంద్ర మాట్లాడుతూ, గిరిజన కాలనీలో నివసిస్తున్న గిరిజనులకు ఎన్నో సంవత్సరాలుగా పూరిగుడిసెలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వారి అవసరాలు నిమిత్తం కీర్తిశేషులు  రాములు జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు ఈ వితరణ అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి తండ్రి రాములు పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు.