గ్రామీణ, పట్టణ అభివృద్ధిలో ఎన్.జి.ఓ ల పాత్ర అనే అంశం పై జరిగిన సమావేశంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి.

తిరుపతి:  రాస్ స్వచ్ఛంద సంస్థ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సమావేశానికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రత్యక అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఎన్.జి.ఓ లు వైద్యం, విద్యా ప్రణాళికలు, అక్షరాస్యత ఇలా అనేక అంశాలలో వారి పాత్ర ఎనలేనిదని అయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇప్పటికి 75 సంవత్సరాలు పూర్తయిన కూడా ఇంకా చాలా గ్రామాలలో మౌలిక వసతులు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పారు. తిరుపతి పార్లమెంట్ పరిథిలో సుమారు 128 భారీ పరిశ్రమలు ఉన్నాయని వారు ఖర్చు పెట్టాల్సిన సియస్ఆర్ నిధులు ఎక్కువ భాగం ఆ పరిశ్రమల పరిధిలో కొన్ని గ్రామాలను యూనిట్ గా  తీసుకొని నిధులు ఖర్చు పెట్టె విధంగా ఎన్.జి.ఓ సంస్థలు ప్రణాళిక బద్దంగా ముందుకెళితే  కొన్ని గ్రామాలైన అభివృద్ధి చెందుతాయని వారికి పిలుపునిచ్చారు.