"కాకాణి చేతులు మీదుగా ఫిష్ మార్కెట్ ప్రారంభం"







" సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించేందుకు కృషి చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేసిన అధికారులు, ప్రజలు."

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, పూడిపర్తి, ఈదగాలి గ్రామాలలో పర్యటించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

పూడిపర్తి గ్రామంలో ఫిష్ మార్కెట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి.

సచివాలయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల అమలుపై, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై స్థానిక ప్రజల సమక్షంలో అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో సమీక్షించి, సంతృప్తి వ్యక్తం చేసిన కాకాణి.

యానాది కుటుంబాలకు మొబైల్ ఆధార్ కేంద్రాల ద్వారా నమోదు చేయించి, జారీ చేయించిన ఆధార్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.

వృద్ధులను ఆప్యాయంగా పలుకరించి, చేతికర్రలను అందించిన ఎమ్మెల్యే కాకాణి.

పూడిపర్తి గ్రామంలో వివిధ సందర్భాలలో పర్యటించి, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారంటూ, కాకాణికి ధన్యవాదాలు తెలియజేసిన స్థానిక నాయకులు, ప్రజలు.

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా విన్నపాన్ని మన్నించి, సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించినందుకు నియోజకవర్గ ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో, పరిశీలించేందుకే సచివాలయ స్థాయిలో సమీక్షా, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. యానాది కుటుంబాలకు మొబైల్ ఆధార్ కేంద్రాల ద్వారా ఆధార్ నమోదు చేయించి, ఆధార్ కార్డులు పంపిణీ చేయడంతో పాటు, ఇళ్లు మంజూరు చేయించి, ఇళ్లు నిర్మించి ఇస్తాం. పూడిపర్తి గ్రామ సచివాలయంలో 600 మందికి పెన్షన్లు అందిస్తూ, కేవలం నలుగురికి మాత్రమే, సాంకేతిక కారణాల వల్ల పెన్షన్ రావడం లేదని తేలింది. గ్రామాలలో 99 శాతం అర్హులైన వారందరికీ పార్టీలకతీతంగా, పారదర్శకంగా పెన్షన్లు అందిస్తున్నాం. సాంకేతిక కారణాల వల్ల అర్హులైన వారికి సంక్షేమ కార్యక్రమాలు మంజూరు కాకపోతే, లోపాలను సవరించి, అర్హులైన వారందరికీ 100 శాతం సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యేలా చూస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలన్నీ తుంగలోకి తొక్కి, ప్రజలను మోసం చేస్తే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ, అదనంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు పార్లమెంట్ నుండి విడగొట్టి, తిరుపతి పార్లమెంట్ లో కలిపినప్పుడు నోరుమెదపని వారు, నేను పట్టుపట్టి సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగేలా కృషి చేస్తే, తట్టుకోలేక కడుపుమంటతో నానా విమర్శలు చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో జరిగిన అభివృద్ధి, నా 30 నెలల కాలవ్యవధిలో అధికారపార్టీ శాసనసభ్యునిగా జరిగిన అభివృద్ధికి నియోజకవర్గ ప్రజలే సాక్ష్యం. సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో మాదిరిగా అవినీతికి ఆస్కారం లేకుండా, అభివృద్ధే ధ్యేయంగా, అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నాం. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు నాణ్యమైన, సంపూర్ణ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడంలో భాగంగా చేపలు, రొయ్యలు అనేక రకాల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచాం. జిల్లాలో నాలుగు హబ్ లు ఏర్పాటు చేసి, ప్రతి సచివాలయ పరిధిలో ఫిష్ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, మేటి నియోజకవర్గంగా తీర్చిదిద్ది, రెండు సార్లు శాసన సభ్యునిగా అవకాశం కల్పించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి నా శాయశక్తులా కృషి చేస్తా.