సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధి వాలంటీర్లకు సన్మానం మరియు
వైయస్సార్ సున్నా వడ్డీ పథకం చెక్కులు పంపిణి కార్యక్రమాన్ని చేపట్టిన స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య.

తిరుపతి జిల్లా. సూళ్లూరుపేట  :  పట్టణంలోని స్థానిక రాఘవరెడ్డికల్యాణమండపం లో మున్సిపాలిటీ పరిధిలోని వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం మరియు వైయస్ఆర్ సున్నా వడ్డీ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ వాలంటీర్లకు సన్మానం చేసి
పురస్కారాలు అందజేశారు. అనంతరం 646 పొదుపు సంఘాలలోని 6558 మంది పొదుపు మహిళలకు 93 .38 లక్షలు చెక్కును ఎమ్మెల్యే చేతులు మీదుగా అందజేశారు.
 మున్సిపాలిటీ మరియు మెప్మా అద్వర్యం లో సంయుక్తంగా నిర్వహించిన
ఈ కార్యక్రమం లో మునిసిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి,పట్టణ వైసీపీ
అధ్యక్షుడు కళత్తూరు శేఖర్ రెడ్డి, తహశీల్దార్ రవికుమార్,మునిసిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్ , మెప్మా అధ్యక్షురాలు స్వప్న, మునిసిపల్
కౌన్సిలర్లు,వైసీపీ నేతలు పాల్గొన్నారు.