నాయుడుపేటలో భగవతి శ్రీ శ్రీ శ్రీ మల్లికాంబ అమ్మవారి, శ్రీ గణపతి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట, మహా కుంభాభిషేకం మహోత్సవం,

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో వెలసియున్న భగవతి శ్రీ శ్రీ శ్రీ మల్లికాంబ అమ్మవారి, మరియు శ్రీ గణపతి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవము, స్వర్ణముఖి నది పెద్ద బ్రిడ్జి పక్కన షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఈ నెల 22వ తేదీ మొదలు మూడు రోజులు శ్రీ గూడూరు రఘునాథ్ రెడ్డి గారి సౌజన్యంతో మరియు అవధూత సేవకులు శ్రీ వటుకనాథ స్వామి పర్యవేక్షణలో జరగనున్న, అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం, ఈ కార్యక్రమంలో బుధవారం రోజున నెల్లూరు వారిచే భజన 23వ తేదీ గురువారం శ్రీ మల్లికాంబ అమ్మవారి నామ స్మరణ, 24 శుక్రవారం రోజున, ఖమ్మం జిల్లా వాస్తవ్యులు, శ్రీ పద్మనాభ రెడ్డి గారిచే మహాత్ములను సేవించుకోవడం ఎలా అనే అంశం మీద ప్రవచనం, దీపాలంకరణ జరుగును, మూడు రోజులు అన్నదాన కార్యక్రమం జరుగునని, కావున అనేకంగా భక్తులందరూ విచ్చేసి అమ్మ వారి కృపాకటాక్షాలు పొందగలరని, అమ్మవారి భక్త బృందం, అమాస వెంకటసుబ్బయ్య, శ్రీ  వటుక నాధులు కృష్ణమాచారి స్వామి గార్లు పిలుపునిచ్చారు