పేటలో ఘనంగా బాబు జగజ్జీవనరావు 115వ జయతి వేడుకలు.

తిరుపతి జిల్లా.సూళ్లూరుపేట:-

 సూళ్లూరుపేట మునిసిపల్ కార్యాలయం లో బాబు జగజ్జీవనరావు 115 వ జయంతిని
ఘనంగా జరుపుకున్నారు. మునిసిపల్ కార్యాలయం లో బాబు జగజ్జీవనరావు చిత్రపటానికి పూలు వేసి ఘననివాళిలర్పించారు మునిసిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్. కమిషనర్ అద్వర్యం లో జరిగిన ఈ  జయంతి వేడుకల్లో బాబు జగజ్జీవనరావు చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమం లో పట్టణ వైసీపీ అధ్యక్షుడు
కళత్తూరు శేఖర్ రెడ్డి,     మునిసిపల్ కౌన్సిలర్లు మీజురు రామకృష్ణ రెడ్డి , పముజుల
విజయలక్ష్మి,బందిలి మహేశ్వర్ ,పొన్నా మునిప్రసాద్, తుపాకుల సుశీలమ్మ ,కో అప్షన్
సభ్యులు కళత్తూరు సునీల్ రెడ్డి,కాళహస్తి బాబు రావు ,వైసీపీ నేత తుపాకుల ప్రసాద్, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.